'మద్యం సేవించి నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'
MNCL: హాజీపూర్ మండలం రాపల్లిలో జరిగిన రోడ్డు భద్రతా సదస్సులో MLA ప్రేమ్ సాగర్ రావు సోమవారం పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం నిర్దేశం చేశారు.