ఉసిరి తోటలో 108 జంటలతో కార్తీక వ్రతాలు
MHBD: కేసముద్రం మండలం బిచ్చా నాయక్ తండాలోని ఉసిరి తోటలో ఇవాళ శ్రీ మహా లక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 108 జంటలు కార్తీక మాస సామూహిక వ్రతాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ మాట్లాడుతూ.. కార్తీక మాసం పవిత్రమైనదని, ఉసిరి చెట్టుకు ఆయురారోగ్య శక్తి ఉందని అన్నారు. సామూహిక ప్రదక్షిణలు, వ్రతాలు సంప్రదాయమని పేర్కొన్నారు.