'RMPల శిక్షణకు ప్రభుత్వం కమిటీ వేయడం హర్షం'

VZM: గ్రామీణ వైద్యుల(RMP) శిక్షణపై త్వరలో ఓ కమిటీ వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జోనల్ అద్యక్షులు జంగం జోషి తెలిపారు. గురువారం నగరంలోని సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ.. దీంతో RMPలు మరింత సమర్థవంతంగా, సరైన పద్ధతిలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించగలుగుతారన్నారు.