ఆర్కే రోడ్డు పనులకు శంకుస్థాపన

ఆర్కే రోడ్డు పనులకు శంకుస్థాపన

BPT: రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో రూ.1.05కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టనున్న ఆర్కే రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌తో కలిసి ఈ పనులకు భూమిపూజ చేశారు. నాణ్యతతో కూడిన రోడ్డు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయనున్నారు.