'ఆలయాల అభివృద్ధికి నిస్వార్ధంగా కృషి చేయండి'
CTR: ఆలయాల అభివృద్ధికి నిస్వార్ధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగర పరిధిలోని శ్రీ ఆగస్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.