అయ్యప్పస్వామి గుట్టపైన ఉత్తర నక్షత్ర వేడుకలు

KNR: కోరుట్ల అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం రోజున ఉత్తరనక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామీ మూల మూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం 25 మంది భక్తులు అయ్యప్ప గిరి ప్రదక్షిణ చేశారు. గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం మన ప్రాంత ప్రజల పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేపు రాముశర్మ, అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు.