పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది:MLA

HNK: పేదల ఆరోగ్యం పట్ల ప్రజా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం HNKలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య రంగంలో సరికొత్త సాంకేతికతతో ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద రెండో నగరమైన WGL, HNK,కాజీపేటలో అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.