సీతాయిపేట్ ఏకగ్రీవ సభ్యులకు ధ్రువ పత్రాల అందజేత

సీతాయిపేట్ ఏకగ్రీవ సభ్యులకు ధ్రువ పత్రాల అందజేత

NZB: ధర్పల్లి మండలం సీతాయిపేటలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో ఆదివారం రిటర్నింగ్ అధికారి గంగాధర్, కార్యదర్శి శ్రీనివాస్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ధ్రువపత్రాలు అందజేశారు. సర్పంచ్‌గా భూమేష్, ఉపసర్పంచ్‌గా చంద్రకాంత్, 8 మంది వార్డు సభ్యులకు అధికారికంగా ధ్రువపత్రాలను ఇచ్చారు.