అధికారిక కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ

అధికారిక కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్.. నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం తనకు కేటాయించిన అధికారిక వాహనాన్ని రాష్ట్రపతి భవన్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. 53వ చీఫ్ జస్టీస్‌గా సూర్యకాంత్ ప్రమాణం చేసిన అనంతరం గవాయ్ తన సొంత వాహనంలో వెళ్లారు. సీజేఐగా రిటైర్ అయిన తర్వాత మాజీ సీజేఐలు అధికారిక నివాసాలతోపాటు ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది.