హైదరాబాద్ హౌస్ ప్రత్యేకతలు ఇవే

హైదరాబాద్ హౌస్ ప్రత్యేకతలు ఇవే

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన హైదరాబాద్ చివరి నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందినదే ఈ హౌస్. 1920లోనే సుమారు 2 లక్షల పౌండ్ల వ్యయంతో 8.2 ఎకరాల స్థలంలో సీతాకోకచిలుక ఆకృతిలో నిర్మించారు. రెక్కలు పక్క రోడ్లతో కలిసిపోయేలా తీర్చిదిద్దారు. తన వైభవానికి ఏమాత్రం తగ్గకుండా నిజం నవాబు కట్టించారు. 36 గదులు, ఆరు టైల్డ్ బాత్‌రూంలు, అద్భుతమైన మెట్ల మార్గాలు ఉంటాయి.