పోచమ్మ తల్లికి బోనం సమర్పించిన మంత్రి

పోచమ్మ తల్లికి బోనం సమర్పించిన మంత్రి

WGL: గీసుకొండ మండలం వంచనగిరిలో పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి బుధవారం మంత్రి కొండా సురేఖ గ్రామ ప్రజలతో కలసి వచ్చి అమ్మవారికి స్వహస్తాలతో బోనాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని తెలిపారు. ప్రకృతిని తల్లిగా భావిస్తూ బోనాలతో అమ్మవార్లకు పండుగ చేసే ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుందని అన్నారు.