VIDEO: బీఆర్ఎస్ నేతలపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
WGL: రాయపర్తి మండల పెర్కవేడుకు చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు పుట్ట రాజు, బండి రాజబాబుపై శనివారం దాడి జరిగింది. పత్తిని వరంగల్ మార్కెట్‌కు తీసుకెళ్తుండగా రాజీవ్ చౌరస్తా వద్ద మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు వారిపై బైక్ తాళాలు, బాటిళ్లతో దాడి చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు.