చికిత్స పొందుతూ యువకుడు మృతి

W.G: భీమవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి తాడేరు గ్రామానికి చెందిన శివరామ్ (19) ఈనెల 11న ద్విచక్ర వాహనంపై భీమవరం వస్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు అతని తండ్రి శ్రీనివాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.