ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త, డాక్టర్ బాలు ప్రతిభా రత్న టాలెంట్ అవార్డు 2026 కు ఎంపికయ్యాడు. ఈ అవార్డును హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ కమిటీ ఎంపిక చేశారు. ఈ అవార్డును శుక్రవారం హైదరాబాదులోని, రవీంద్ర భారతిలో అందజేయడం జరుగుతుందని, హ్యూమన్ రైట్స్ నేషనల్ ఛైర్మన్ కొంపల్లి సత్యనారాయణ బుధవారం తెలిపారు.