ఉల్లాస్-అమ్మకు అక్షరమాల కార్యక్రమం

ఉల్లాస్-అమ్మకు అక్షరమాల కార్యక్రమం

JGL: వెంగలాయిపేట గ్రామ పాఠశాలలో ఆదివారం 'ఉల్లాస్-అమ్మకు అక్షరమాల' కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు అక్షరాస్యత పరీక్షలు నిర్వహించారు. మహిళలు విద్యతోనే సాఫల్యం సాధిస్తారని,ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్ గోపాల్ పేర్కొన్నారు. ఈ పరీక్షా కేంద్రాన్ని మాజీ ఎంపీటీసీ సుప్రియ,సీఏ రజిత,వీఏ లత, తదితరులు పర్యవేక్షించారు.