స్టేషన్ ఘనపూర్‌లో సొమ్మసిల్లి మృతి
JN: స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో ఆదివారం సాయంత్రం సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. కొడకండ్ల మండలం వాసరం తండాకు చెందిన భూక్య లాల్ సింగ్ (57) గ్రామాల్లో తిరిగి కందగడ్డ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. సొమ్మసిల్లిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.