దళితుల పట్ల స్పీకర్ వైఖరి సరికాదు: ఎమ్మెల్సీ

దళితుల పట్ల స్పీకర్ వైఖరి సరికాదు: ఎమ్మెల్సీ

కోనసీమ: అనకాపల్లిలో దళిత వృద్ధ కళాకారుడిపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకోవడంపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఫైర్ అయ్యారు. అల్లవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల పట్ల స్పీకర్ వైఖరి అహంకారపూరితంగా ఉందన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కళాకారుడిపై ప్రతాపం చూపటం మీ అధికారమదానికి నిదర్శనమని మండిపడ్డారు.