ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ELR: కుక్కునూరు మండలం నెమలిపేటలో సోమవారం ఉపాధి పనికి వచ్చిన కూలీలు పని చేస్తుండగా వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు పదిమంది గాయపడ్డారు. గాయపడిన కూలీలను స్థానికులు కుకునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని జనసేన, సీపీఎం నాయకులు పరామర్శించారు.