ఏకగ్రీవంగా పీఆర్టీయూ కార్యవర్గ ఎన్నిక

ఏకగ్రీవంగా పీఆర్టీయూ  కార్యవర్గ ఎన్నిక

కరీంనగర్: కాటారంలోని శ్రీ హర్షిత డిగ్రీ కళాశాల ఆవరణలో పీఆర్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా ఆంగోతు రవీందర్, ప్రధాన కార్యదర్శిగా అనపర్తి తిరుపతి, అసోసియేట్ అధ్యక్షులుగా సతీష్, మండల మహిళా ఉపాధ్యక్షులుగా ఎస్ శైలజ, మండల మహిళ కార్యదర్శిగా గీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, జిల్లా ఎన్నికల పరిశీలకులు తెలిపారు.