పేకాట స్థావరంపై పోలీసుల దాడి
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రహస్య సమాచారంతో దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ. 41,500 నగదు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ చేసినట్లు తెలిపారు.