VIDEO: స్వస్థలానికి చేరుకున్న అనూష మృతదేహం
BHNG: కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరం అనూషా రెడ్డి మృతదేహం, తన స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి కాసేపటి క్రితం చేరుకుంది. DNA పరీక్ష అనంతరం ఆంధ్ర అధికారులు అనూష మృతదేహాన్ని నిన్న మధ్యాహ్నం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న అనూష మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.