అర్ధవీడు మండలంలో పెద్దపులి టెన్షన్

అర్ధవీడు మండలంలో పెద్దపులి టెన్షన్

ప్రకాశం: అర్ధవీడు మండలంలో కొన్ని నెలలగా ప్రజలను పెద్దపల్లి టెన్షన్ వెంటాడుతుంది. రెండు రోజుల క్రితం మండలంలోని బొల్లాపల్లి గ్రామంలో పెద్దపులి ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెద్దపులి కదలికలపై దృష్టి పెట్టామని మార్కాపురం డిప్యూటీ రేంజ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.