తిరుపతిలో 5K రన్
TPT: మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతిలో ఆదివారం 5K రన్ నిర్వహించారు. సుమారు 500 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజంలో డ్రగ్ నిర్మూలనకు మద్దతు తెలిపారు. పోలీసులు NDPS చట్టం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే చెడు పరిణామాలను వివరించారు. అనంతరం 'సే నో టు డ్రగ్స్' ప్రతిజ్ఞ చేశారు.