కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత
MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ముష్కే వెంకట్ కుటుంబానికి ఆయన మిత్రులు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 2000 బ్యాచ్‌కు చెందిన వెంకట్ సహ ఉద్యోగులు సేకరించి, రూ.2 లక్షల చెక్‌ను వారి కుటుంబానికి అందించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన పోలీసులు స్నేహ ధర్మం చాటుకున్నారు.