'గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

BHNG: గీత కార్మికులకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్ గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రామన్నపేట మండల తాహసీల్దార్ కార్యాలయం ముందు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి గీత పనివారల సంఘం యాదాద్రి జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేశ్ గౌడ్ హాజరై మాట్లాడారు.