వైభవంగా శివకళ్యాణ మహోత్సవాలు
SRCL: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో నాలుగో రోజు ఆదివారం శివకళ్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. సోమవారం ఐదో రోజు ముగింపు పూజలతో ఈ ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయని అన్నారు