కారుణ్య నియామక పత్రాలు అందజేసిన జడ్పీ ఛైర్ పర్సన్
ELR: జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం కారుణ్య నియామకాల కింద ఎంపికైన ఇద్దరు ఆఫీస్ సబ్-ఆర్డినేటర్లకు నియామక పత్రాలను జెడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ అందజేశారు. సూర్య చరణ్ తేజ్‌ను ఏలూరు జెడ్పీ కార్యాలయానికి, తాళ్లూరి అభి శ్రీని లింగపాలెం మండల పరిషత్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. నిబద్ధతతో పనిచేసి మెరుగైన సేవలు అందించాలని పద్మశ్రీ వారికి సూచించారు.