నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ మస్తాన్ తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. యానాదికాలనీ, దుర్గానగర్, ముగ్గునగర్, సత్యనారాయణ స్వామిగుడి వీధి, యాదవుల బజారు వంటి ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.