అవుకులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యేలు
NDL: అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామంలో శనివారం మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనంతరం కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.