'వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

NRPT: అల్పపీడన ద్రోణి కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ఆమె ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలోని చిన్నవాగు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వర్షాలు పడుతున్నందున వాగులో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు ప్రవాహాన్ని చూసి దాటాలని సూచించారు.