అనధికారిక పరిశ్రమలపై నిరంతరం నిఘా: రీజనల్ విజిలెన్స్ ఎస్.పి.

KKD: రాజమహేంద్రవరం రూరల్ మండలములోని బొమ్మూరు గ్రామములోని కేశవరం రోడ్డులో గల రామ్స్ బేవరేజెస్ సోడా తయారీ యూనిట్‌ను శనివారం విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజి, రెవిన్యూ అధికారులు తనిఖీ చేశారు. రీజనల్ విజిలెన్స్ ఎస్.పి.కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అనధికారిక కూల్ డ్రింక్స్, సోడా పరిశ్రమలపై నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు.