నిధులు మంజూరైనా ముందుకు సాగని పనులు
MLG: ఏటూరినాగారం(M) చిన్నబోయినపల్లి - కొండాయి మీదుగా మేడారానికి వెళ్లే మార్గంలో దొడ్ల వద్ద జంపన్నవాగుపై బ్రిడ్జి పనులు ఇప్పటీకి మొదలు కాలేదు. ఈ మార్గంలో తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మాణానికి రూ. 60 లక్షలు మంజూరు అయినా, పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్వరలో జాతర ఉన్న నేపథ్యంలో అధికారులు స్పందించి భక్తులు సౌకర్యార్ధం పనులను వేగవంతం చేయాలని వారు కొరుతున్నారు.