VIDEO: రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి సజీవదహనం

VIDEO: రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి సజీవదహనం

VSP: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి తాడిపత్రికి వేప నూనెతో వెళ్తున్న ట్యాంకర్, అనంతపురం నుంచి రాజమండ్రికి టమోటా లోడుతో వెళ్తున్న మినీలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. మృతుడు విశాఖపట్నంకు చెందిన దుర్గారావుగా గుర్తించారు.