'విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని వినతి'
ADB: ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషను న్యూ అగ్రజా టౌన్ షిప్ కాలనీవాసులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో విద్యుత్ దీపాలు, పలు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఛైర్మన్ అనూష సానుకూలంగా స్పందించినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, జలంధర్, మురళి, తదితరులు పాల్గొన్నారు.