రహదారులు, కాలువలు ఆక్రమిస్తే చర్యలు: కమిషనర్

రహదారులు, కాలువలు ఆక్రమిస్తే చర్యలు: కమిషనర్

VZM: రహదారులు, కాలువలు ఆక్రమించి వ్యాపారాలు చేయరాదని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఆయన ఆదేశాలతో సిటీ బస్టాండ్, రాజీవ్ స్టేడియం ప్రాంతాల్లో రోడ్డు, కాలువలపై ఉన్న బడ్డీకొట్టులను తొలగించారు. ప్రజలు, వాహనాల రాకపోకలు పెరిగినందున ఆక్రమణలు తగదని కమిషనర్ అన్నారు. ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.