రేపు మేళ్లచెరువు రానున్న ముగ్గురు మంత్రులు
SRPT: మేళ్లచెరువు స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 5 అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆలయ ఈవో శంభిరెడ్డి తెలిపారు. ఆయనతో పాటు మంత్రులు లక్ష్మణ్, కొండ సురేఖ కూడా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.