మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో MLA

GNTR: పట్టాభిపురంలో సినీ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు తాటిశెట్టి మురళి నివాసంలో కొండబోయిన శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు.