అలుగు పారుతున్న నల్లవాగు ప్రాజెక్టు

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 3296 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అలుగు ద్వారా 3241 క్యూసెక్కులు ఔట్ ఫ్లో అవుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ శ్రీ వర్ధన్ రెడ్డి మంగళవారం ఉదయం ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1493.83 అడుగుల వద్ద జలాలు నిల్వ ఉన్నాయని చెప్పారు.