'త్వరగా బిల్లులు చెల్లించాలి'
ప్రకాశం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలిన వారికి త్వరగా బిల్లుల మంజూరు చేయాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ రాజాబాబును కోరారు. సోమవారం నియోజకవర్గ నాయకులతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.