విజేతలకు బహుమతులు అందజేత
SDPT: అక్కన్నపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పోటీల్లో చెరుకు రక్షిత ప్రథమ స్థానం, నాంపల్లి రక్షిత ద్వితీయ, ఎడ్ల దివ్య తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఎస్సై చాతరాజు ప్రశాంత్ బహుమతులు అందజేశారు.