అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల నిర్వహణపై సమీక్ష

అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల నిర్వహణపై సమీక్ష

WNP: ఏప్రిల్ 14న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సూచించారు. గురువారం వనపర్తి అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ప్రజా సంఘాల నాయకులతో సమీక్షించారు. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు.