లక్కీ డ్రా‌లో లక్కీగా గెలుచుకున్న సర్పంచ్ అభ్యర్థి

లక్కీ డ్రా‌లో లక్కీగా గెలుచుకున్న సర్పంచ్ అభ్యర్థి

SRPT: జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటి నాయక్ తండాలో స్థానిక ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సరిగ్గా 315 చొప్పున సమానంగా ఓట్లు పోలవడంతో అధికారులు డ్రా తీయాల్సి వచ్చింది. ఈ లాటరీలో అదృష్టం బీఆర్ఎస్‌ను వరించింది. బీఆర్ఎస్ అభ్యర్థి ధరావత్ చిట్టి పేరు రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.