'పత్తి రైతుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న వివక్షత నశించాలి'
KMM: పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వివక్షత నశించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇవాళ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పార్టీ శ్రేణులతో నిరసన తెలిపారు. పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారా కొనుగోళ్లు పెంచాలని అన్నారు.