VIDEO: ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగిందన్నారు. అనంతరం దీంతో కూటమి పాలనపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.