న్యాయస్థానాలు ప్రభుత్వం వైపే నిలుస్తాయి: MLC

న్యాయస్థానాలు ప్రభుత్వం వైపే నిలుస్తాయి: MLC

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ BRSపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్‌పై KCR హైకోర్టుకు పోవడం అంటే చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ను అవమానించినట్లే అని అన్నారు. అవినీతి, అక్రమాలు జరిగాయని తేలిన తర్వాత కోర్టుకు వెళ్తే ఏదో జరుగుతుంది అనుకోవడం వాళ్ళ భ్రమని ఎద్దేవా చేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టు అయినా ప్రభుత్వం వైపే నిలుస్తుందని అనుకుంటున్నానని స్పష్టం చేశారు.