జిల్లా పరిషత్ స్థాయి సమావేశం

ELR: ఏలూరు జడ్పీ కార్యాలయంలో జడ్పీ స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీహరి, సభ్యులు, వివిధ శాఖల శాఖాధిపతులు పాల్గొని, శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి గైర్హాజరైన శాఖాధికారులకి నోటీసులు జారీ చేశారు.