నెల్లూరుతో పొట్టి శ్రీరాములుది విడదీయలేని అనుబంధం..!
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే అర్పించిన గొప్ప మహానీయుడు పొట్టి శ్రీరాములు. ఆయనకు నెల్లూరుతో అనుబంధం విడదీయలేనిది. తన జీవితంలో చాలాకాలం పడమటిపల్లె గ్రామంలోనే గడిపారు. మూలపేట వేణుగోపాలస్వామి ఆలయంలో దళితులకు ప్రవేశం కల్పించాలని అప్పట్లో నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన ప్రాణ త్యాగానికి నివాళిగా జిల్లాకు 'శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు' అని పేరు పెట్టారు.