ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆదర్శంగా 'పొనుగోడు'

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆదర్శంగా 'పొనుగోడు'

NLG: పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద మంజూరైన ఇళ్లు తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.