అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
VZM: భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి కీ.శే మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ విద్యకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.