'21 ఏరియా నిర్వాసితులకు న్యాయం చేయాలి'

'21 ఏరియా నిర్వాసితులకు న్యాయం చేయాలి'

BDK: ఇల్లందు 21 ఏరియాలోని విజయలక్ష్మి నగర్ నివాసితులకు సింగరేణి యాజమాన్యం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై అఖిలపక్ష నాయకులు అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా నివసిస్తున్న తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని వేధించడం సరికాదన్నారు. ప్రజావాణిలో మొరపెట్టుకున్న తమకు ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని వారు కోరారు.